Jump to content

User:Co VKRBHKaza

From Wikipedia, the free encyclopedia

సమయం లేదు చంద్రమా!!

----------------------------------

   ఒక ప్రమాదం ! ఒక నిర్లక్ష్యం ! అనేకమంది మృతి ! ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారింది.ఇది నిష్టూరసత్యం !

     కనీస విశ్రాంతి కి సమయం  చిక్కని మీ బిజీ షెడ్యూల్ సమస్యలు గుర్తించటానికి వీలు కుదరటం లేదు.ఒక పర్యాటక శాఖ మాత్రమే కాదు...అనేక శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది.

     తప్పని పరిస్థితుల్లో సర్వేలు, నిఘా వర్గాలు మీద ఆధారపడాల్సివస్తుంది.ఇవన్నీ కొంతవరకే వాస్తవాలు తెలియజేస్తాయి.

       రాజకీయాలలో కొందరికి కొన్ని టార్గెట్లు ఉంటాయి. సాధారణ కార్యకర్త రాజ్యాంగపదవో ,పార్టీ పదవో లభిస్తే తృప్తి పడతారు.వారి జీవితాశయం సిద్దించినట్టే...అంతకుమించి...లభిస్తే జీవితసాఫల్యం!అందుకే వారికి పార్టీ పట్ల,ప్రజలపట్ల సీరియస్ నెస్ ఉండదు.పార్టీ నష్టపోతే వారికి పోయేది ఏమీ ఉండదు.సమాజం లో గుర్తింపు వచ్చింది కాబట్టి భవిష్యత్తు కు డోకా లేదు.వీరిమీద పూర్తిగా ఆధారపడరాదు.

       ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే  ఉద్యోగం పొందిన వెంటనే సోషల్ స్టేటస్ , ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. తొంభైశాతం మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తారు.వారికి ఎంతచేసినా తృప్తి ఉండదు.తప్పుచేసికూడ తిరగబడతారు.వారి  సంఘాలు అండగా ఉంటాయి. వీలైతే కులం కార్డు వాడతారు. లంచాలు..స్వప్రయోజనాలు వారి లక్ష్యం.

    ఉపాధ్యాయ వృత్తి రానురాను పూర్తిగా దిగజారిపోయింది.సంఘాలు...రాజకీయాలు మీద వీరి దృష్టి అంతా!సగానికిపైగా ఉపాధ్యాయులు పనిచేయాలనుకున్నా చేయలేని పరిస్థితి.

   ఇక అధికారులు వీరిపై మీరు పూర్తిగా ఆధారపడుతున్నారు. మెజారిటీ అధికారులు కి మీరు నచ్చరు.మీరంటే భయం లేదు.మీ ఉనికి గిట్టదు.వారు చేసిన తప్పులు మీకు చుట్టుకుంటాయి.వారిని పూర్తిగా నమ్మకూడదు.వ్యవస్థ లను నిర్వీర్యం చేసిన ముఠాలకు మద్దతు గా నిలుస్తారు.పాపం నిజాయితీ పరులనుకూడా నిందించాల్సిన పరిస్థితి.

   పంట కాలువ ల్లో వేళ్ళూనుకుపోయిన గుర్రపుడెక్క మాదిరి కుళ్ళును మీరు గమనించ లేరు. ఇవన్నీ పైకి కనిపించని అవరోధాలు.

  ఈ రాష్ట్రానికి... దేశానికి మీ సేవలు ఎంతో అవసరం.తప్పనిసరిగా మీరు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది.పూర్తి స్థాయి లో ప్రజల మద్దతు కావాలి.

   మీరంటే అభిమానించే మంత్రులు,నాయకులు, కార్యకర్తలు ఉన్నారు .

   ఏ స్వార్థం లేకుండా మీకు,పార్టీ కి అండగా ఉండేందుకు మీ అభిమానులు సిద్దంగా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు పట్ల ఆవేదన చెందుతున్నారు. ఆందోళన గా ఉన్నారు.

  వారి సేవలు క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఉపయోగించండి. ఒక  వ్యవస్థ ను ఏర్పాటు చేయండి. సమస్యలు, ప్రజాభిప్రాయం మీ దృష్టి కి వస్తాయి.మీ దృష్టి కి వస్తే నే సగం పరిష్కారం అవుతుంది. సంబంధిత అధికారులు అప్రమత్తం అవుతారు. మేలు పొందిన వారు మీకు ప్రభుత్వానికి అండగా ఉంటారు.

    మీరు సినిమా స్టార్ కాదు!క్రీడాకారుడు కాదు!గ్లామర్ పర్సన్ కాదు!ఆధ్యాత్మిక ప్రభోదకులు కాదు!యోగా గురువులు కాదు! అయినా దేశంలో ఎవరికీ లేనంత మంది అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా మీకున్నారు.మీ అభిమానుల ను నమ్మండి.మీరు అధికారంలో ఉండాలనే స్వార్థం మాత్రం ఉంది.