Jump to content

User:Vinaynuthan

From Wikipedia, the free encyclopedia

మల్యాల రాంచందర్ గౌడ్

[edit]

మల్యాల రాంచందర్ గౌడ్ (జననం 1958) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నుండి 1987 లో కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండల పరిషత్ చైర్మన్ (MPP) గా బాధ్యతలు నిర్వహించాడు.


వ్యక్తిగత వివరాలు:

జననం  : 1958

చిరునామా  : గ్రామం&మండలం కమాన్ పూర్, జిల్లా పెద్దపెల్లి, తెలంగాణ.

రాజకీయపార్టీ  : కాంగ్రెస్

జీవిత భాగస్వామి  : కౌసల్య

నివాసం  : కమాన్ పూర్

రాజకీయ జీవితం

[edit]
  1. 1972 - 1987 కాలంలో సింగరేణి కాలరీస్ సంస్థ ఉద్యోగిగా పనిచేసిన కాలంలో గోదావరిఖని ప్రాంతంలోని కార్మికులతో సత్సంబంధాలు కలిగివున్నారు.
  2. 1977 లో ఆవిర్బవించిన గోదావరి లోయ బొగ్గు కార్మిక యూనియన్ లో క్రియాశీల పాత్ర పోషించారు.
  3. CPI-ML ప్రతిఘటన లో వ్యవస్థాపక సభ్యుడిగా వున్నారు.
  4. 1980 లో గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు జరిగిన CPI-ML పార్టీ ఎన్నికలలో జిల్లా కార్యదర్శిగా గెలిచారు.
  5. 1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అందులో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు.
  6. 1985 లో తెలుగుదేశం కమాన్ పూర్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
  7. 1987 లో సమితిల స్థానంలో మండలాలు ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా నిలిచి కామాన్పూర్ MPP గా ఎన్నికయ్యారు. 1987 నుండి 1992 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన సుద్దాల దేవయ్య మద్దతుతో ప్రభుత్వ పథకాలతో లబ్ది చేకూర్చడం ద్వారా సాధారణ ప్రజల అభిమానం చూరగోన్నారు.
  8. 1989 డిసెంబర్ 27న అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ కిడ్నాప్ చేయడంతో సంచలనానికి కేరాఫ్ గా నిలిచారు. 1987 లో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ లోని గుర్తేడులో ఆరుగురు IAS లని కిడ్నాప్ చేసినతరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రజా ప్రతినిధులను పీపుల్స్ వార్ అపహరించడం అదే తొలిసారి. ప్రజాభిమానం మెండుగా ఉండటంతోపాటు కొరియర్ల హేచ్చరికలతో ఐదు రోజుల అనంతరం విడిచిపెట్టారు.
  9. 1992 లో సింగరేణి ప్రాంతంలో ప్రాబల్యమున్న జనరక్షణ నక్సలైట్లు రెండోసారి కిడ్నాప్ చేసి మూడు రోజుల అనంతరం విడిచిపెట్టారు.
  10. 1997 లో సింగరేణి కార్మిక సంఘం తరుపున రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం వుంది.
  11. గీతకార్మిక సంఘాలతో సుదీర్ఘ అనుభవముంది. దివంగత మాజీ శాసనసభ్యుడు దేశిని చిన్నమల్లయ్యతో కలిసి చాలాకాలం గీతకార్మికుల సమస్యలపై పోరాటం చేశారు.
  12. 1995-1998 కాలంలో కల్లు గీతపనివారల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
  13. 1998 - 2000 కాలంలో బసంత్ నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా పనిచేశారు. అప్పటి ఎన్నికల్లో కార్మిక సంఘం దిగ్గజనేత నాయిని నర్సింహారెడ్డి గారి మీద గెలుపొందడం సంచలనం కలిగించింది.
  14. 2001-2002 కాలంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గసభ్యుడిగా చేశారు.
  15. 2002-2004 కాలంలో జిల్లా అడ్ హక్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
  16. 2002 స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపెల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు.
  17. తెలంగాణ ఉద్యమకారుడిగా సుదీర్ఘ అనుభవముంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహారించారు.
  18. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో సీనియర్ నాయకుడిగా అందరికి సుపరిచితులు
  19. 2018 నుండి ఇప్పటివరకు అఖిలభారత గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.